calender_icon.png 1 May, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ

01-05-2025 06:03:41 PM

నాగల్ గిద్ద (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నగల్ గిద్ద మండలంలో 139వ అంతర్జాతీయ మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా మండలంలోని కూడలి వద్ద సిఐటియు జెండా కెవిపిఎస్ అధ్యక్షులు గణపతి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేవిపీఎస్ మండల నాయకులు గణపతి మాట్లాడుతూ... మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం కార్మిక వర్గ విజయానికి చిహ్నం కార్మిక వర్గ ప్రతిఘటన వల్లనే ఎనిమిది గంటల పని దినం చట్టం చేయబడింది. అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1 న జరిగిన సమ్మె ఆనాటి పాలకుల కుట్రలు కుతంత్రాలతో ఇన్సాత్మకంగా మారింది. ఆ ఇన్సాత్మక ఘటనల్లో నాలుగు కార్మికులు మరణించారు అనేక రక్తం చిందింది.

ఫలితంగా 1989లో రెండవ ఇంటర్నేషనల్ సమావేశం హే మార్కెట్ గతంలో మరణించిన వారిని స్మరిస్తూ అంతర్జాతీయ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మెరుగైన పని పరిస్థితుల కొరకు పోరాడిన దినంగా మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా వచ్చిన ఒత్తిడితోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మే ఒకటిని సెలవుదినంగా ప్రకటించింది వారానికి ఆరు రోజులు 48 గంటల పని స్థానంలో వారానికి ఐదు రోజులు 35 గంటల పని ఉండాలని ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య(WFTU) పిలుపుపై అనేక దేశాల కార్మిక వర్గం పోరాడుతుంది కాబట్టి 8 గంటల పనిని 7 గంటలు 6 రోజుల పనిని 5 రోజులకు తగ్గించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కెవిపిఎస్ నాయకులు కొటారి నర్సింలు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.