29-08-2025 05:53:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పరీక్ష నిర్వహించి 11 నెలలు అయినా ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేసుకోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆ సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరీక్ష రాసి అర్హత సాధించిన పేర్లను ప్రకటించి న్యాయం చేయాలని వారు తెలిపారు.