29-08-2025 05:49:33 PM
జిన్నారం/గుమ్మడిదల: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని వావిలాలలో కమిషనర్ వెంకటరామయ్య ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణి కార్యక్రమం ప్రభుత్వ స్కూల్ లో పిల్లలకు మొక్కల పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ... కాలుష్య నివారణ కు చెట్లు ఎంతో అవసరమన్నారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు బాధ్యతగా పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.