calender_icon.png 29 August, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

29-08-2025 08:00:41 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండలంలోని చిట్యాల,నైన్ పాక, ఓడితల గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి మృతుల కుటుంబ సభ్యులను భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శుక్రవారం పరామర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.

మండలకేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ విలేఖరి బుర్ర చక్రపాణి, ఓంగర్డ్ దేవేందర్ తండ్రి నర్సయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన కట్టెకొల్ల రాజు నాయనమ్మ లక్ష్మీ, గొడుగు కుమార్ తల్లి మల్లక్క, ఒడితల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు రాసూరి మొగిలి సతీమణి ప్రమీల తదితర  కుటుంబాలను పరామర్శించారు.