calender_icon.png 29 August, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా ఏఈఓలపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఏవోలపై చర్యలు తీసుకోవాలి

29-08-2025 08:10:39 PM

జిల్లా ఎస్పీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలి

తుంగతుర్తి,(విజయక్రాంతి): మహిళా ఏఈఓపై అసభ్యకరంగా మాట్లాడిన తుంగతుర్తి ఏవో బాలకృష్ణ, నూతనకల్ ఏవో మురళిలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని గొట్టిపర్తి ఏవో మహిత శుక్రవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో డిమాండ్ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం రాత్రి సూర్యాపేటలో ఇంటికి వెళ్లిన సమయంలో రాత్రి పది గంటల సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడి, బెదిరించినట్లు తెలిపింది.

సమాజంలో మహిళలు కష్టపడి ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటనే ఆమె తెలిపింది. తక్షణమే జరిగిన సంఘటనపై సోషల్ సర్వీస్ సోషల్ జస్టిస్ జాతీయ వ్యవస్థాపకులు మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. తుంగతుర్తి నూతనకల్ ఏవోలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.