calender_icon.png 29 August, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

29-08-2025 07:45:15 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, దివ్యాంగుల కోసం ఉచిత కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఈ శిబిరం ద్వారా దివ్యాంగులకు చేయూత అందించడం సంతోషంగా ఉందని, సమగ్ర శిక్ష తెలంగాణ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.