calender_icon.png 29 August, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పెన్షన్ సాధన పోరాట సభకు కదలి రావాలి

29-08-2025 07:38:58 PM

టీజీఈ జేఏసీ కో చైర్మన్ అబ్దుల్ ఖమర్

బెజ్జూర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సెప్టెంబర్ 1న నిర్వహించ తలపెట్టిన  పాత పెన్షన్ సాధన సభ ధర్నా కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలని టీజీఇజేఏసీ  జిల్లా కో చైర్మెన్ అబ్దుల్ ఖమర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచినట్లు సీపీస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు.

సీఎం కూడా దీనిపై హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు అమలులోకి రాలేదు. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు పాత పెన్షన్‌ను తిరిగి అమలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా అదే విధంగా పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలని మా డిమాండ్” చేశారు.