29-08-2025 07:57:43 PM
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీ కృష్ణ
చిట్యాల(విజయక్రాంతి): ప్రజలు ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను సరి చూసుకోవాలని,అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం అన్ని గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో డ్రాఫ్ట్ ఓటరు లిస్టులను అధికారులు ప్రదర్శించారని తెలిపారు. ఓటర్ లిస్ట్ పై అభ్యంతరాలు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ మేరకు ప్రతి ఒక్కరు తమ తమ ఓటర్ లిస్టులను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ లిస్టులో వార్డుల సవరణ,ఓట్ల గల్లంతు,ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు వేరే వేరే వార్డులలో ఉండటం వంటి తప్పిదాలు జరగవచ్చన్నారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించి సవరించిన ఓటరు జాబితాపై ఆయా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు, మండల అధికారులకు తెలియజేయాలని కోరారు.