calender_icon.png 29 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ బి.ఎం సంతోష్

29-08-2025 07:17:38 PM

గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎంపీడీవోలతో మండలాల వారిగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.  గ్రామాలలో పనులను వేగవంతం చేసే విధంగా గ్రామ కార్యదర్శులు చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

గృహ నిర్మాణ పనులను ప్రారంభించుకొనేందుకు ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు అందించాలని అధికారులను సూచించారు.  గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాని లబ్ధిదారుల పేర్లను వెంటనే లాగిన్ నుండి తొలగించాలన్నారు. ప్రతివారం నిర్వహించే సమీక్షలో పురోగతి సాధించాలని,  పనులలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.