calender_icon.png 6 May, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ షిరిడి సాయి మందిరం 30వ వార్షికోత్సవం..

06-05-2025 05:43:59 PM

భక్తుల ప్రత్యేక ప్రార్థనలు, పాలాభిషేకాలు..

అన్న ప్రసాద కార్యక్రమం..

వైరా (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని సాయి నగర్ శ్రీ షిరిడి సాయి మందిరంలో మంగళవారం 30వ వార్షికోత్సవం, శ్రీ బ్రహ్మసూత్రాత్మక శ్రీ భవాని శంకర్ స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. 1995 సంవత్సరం స్వయంగా స్థల నిర్ణయం చేసిన చోట విగ్రహ ప్రతిష్ట జరిపి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలాభిషేకాలు, పంచామృత స్థానాభిషేకం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బాబా వారికి పంచామృత స్థానాభిషేకం, నూతన వస్త్రాలంకరణ, హారతి నిర్వహించారు.

మందిరంలో భజన బృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు బాబా వారి ఉత్సవిగ్రహమునకు శ్రీ భవాని శంకర్ స్వామి వారికి వచ్చిన భక్తులచే పాలాభిషేకం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. తదుపరి భక్తులకు మందిరంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళ కౌంటర్ ను 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మాదినేని సునీత రాయల అన్నపూర్ణ వజినేపల్లి సునీత రాయల రోజా రాయపూడి రజిని ప్రారంభించారు.

రెండో కౌంటర్ ను ఆలయ కమిటీ కోశాధికారి లగడపాటి బోస్ మందిర కమిటీ సభ్యులు తలపురెడ్డి గోపాల కృష్ణారెడ్డి మాదినేని దుర్గాప్రసాద్ మిద్దె సుబ్బారావు  నల్లమోతు వెంకటేశ్వరరావు వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతలపూడి వెంకటేశ్వరరావు మోహన్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ అభిషేక కార్యక్రమాల్లో శ్రీరామనేని శ్రీనివాసరావు నల్లమోతు లక్ష్మీనారాయణ పెనుగొండ ఉపేందరరావ్ సరిత రంగ సత్యనారాయణ చెరుకూరు శ్రీనివాసరావు మిట్టపల్లి నరసింహారావు కోసూరి శ్యామ్ తదిరులు పాల్గొన్నారు.