06-05-2025 08:47:04 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని పంపించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో(Additional Collector Sri Lenin Vatsal Toppo) క్రీడా సామాగ్రిని నిర్వాహకులకు అందజేశారు. ఇనుగుర్తి ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి జ్యోతి, క్యాంప్ ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.