06-05-2025 08:17:15 PM
జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ నుండి మన దేశానికి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి, జిల్లాలో నివసిస్తున్న రోహింగ్యాలను, వెనక్కి పంపేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి(BJP District President Byreddy Prabhakar Reddy) కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు బిజెపి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు.