06-05-2025 05:22:44 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యువజన సంఘం(Ambedkar Youth Association) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం కమిటి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోలేపాక పరశురాములు మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధిలో అంబేద్కర్ యువజన సంఘం కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం అభివృద్ధికి, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, అందుకు గ్రామ ప్రజల, సంఘం సభ్యుల సహకారం అందించాలని కోరారు. సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వ్యవస్థాపక కమిటీకి, ప్రస్తుత అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులుగా అధ్యక్షులుగా పోలేపాక పరశురాములు, ఉపాధ్యక్షుడిగా పాల్వాయి అంబేద్కర్, ప్రధాన కార్యదర్శిగా పోలేపాక సందీప్, కోశాధికారి పోలేపాక గవాస్కర్, సంయుక్త కార్యదర్శి పోలేపాక అంజి, గౌరవ సలహాదారు పోలేపాక వీరమల్లు, సలహాదారులుగా సతీష్, సుదర్శన్, కమలాకర్, సుదర్శన్, నరేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.