calender_icon.png 29 May, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు జలసౌధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

06-05-2025 09:01:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రేపు సాయంత్రం జలసౌధలో నిర్వహించే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కొత్తగా నియమితులైన 400 మంది ఇంజనీర్లకు నియామక పత్రాలను అందించనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు, సభ్యులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అలాగే ప్రాధాన్యతా సాగునిటి ప్రాజెక్టులు, పనుల పురోగతిపై, నీటి కేటాయింపులు, అంతరాష్ట్ర అంశాలపై, సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్, ఎన్జీటీ కేసుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు.