6 August, 2026 | 2:32 AM

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

06-08-2026 12:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, ఆగస్టు 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ మోసం కేసులో పరారీలో ఉన్న నిందితుణ్ణి బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆన్లైన్ బెట్టి కేసులో  నిందితుని వివరాలను వెల్లడించారు.

31 జులై 2026న రామారెడ్డి పోలీస్ స్టేషన్లో నమోదైన ఆన్లైన్ బెట్టి గేమింగ్ మోసం కేసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సమాచారాన్ని విశ్లేషిస్తూ నిరంతరం దర్యాప్తు కొనసాగించారు.

ఈ క్రమంలో ముఠా లో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చెడిక్కాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు అలియాస్ రొంగలి  ముత్యాలు నాయుడు అనే వ్యక్తిని అరెస్టు చేసి నట్లు తెలిపారు. విచారణలో నిందితుడు సాట్ స్పోరట్స్ ఫ్యూచర్ 9 కంపేర్ నిర్వహిస్తున్న ఆన్లైన్ బుకింగ్ గేమింగ్ వ్బుసైట్ ల ద్వారా ప్రజలకు వాట్స్‌అప్లో లింకులు పంపించి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి అని నమ్మించి డబ్బులు  వసూలు చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు.

బాధితుల పేర్లపై యూజర్ ఐడీలు సృష్టించి యూపీఐ బ్యాంక్ ఖాతాలు క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు స్వీకరించి మోసాలకు పాల్పడినట్లు  దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి ఒక హ్యాపీ ఐఫోన్ మొబైల్ ఫోన్ సాధించే ఎక్కువగా అందులో సాట్ స్పోరట్స్ ఫ్యూచర్ నైన్ కం సంబంధించిన డిజిటల్ ఆధారాలు లభించినట్లు తెలిపారు.

ఈ కేసులో మూటలోని మిగిలిన నిందితులు వారి బ్యాంక్ ఖాతాలు ఆర్థిక లావాదేవీలు డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.