6 August, 2026 | 2:30 AM

‘బడి’కి వసతి చూపారు!

06-08-2026 12:00 AM

నూతన భవనంలోకి విద్యార్థులు

మహబూబాబాద్ జిల్లా బ్రహ్మంగారి తండాలో భవనం అద్దె తీసుకున్న అధికారులు 

మహబూబాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని బ్రహ్మంగారి తండా ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరిస్తూ వంట మనిషి ఇంట్లోనే స్కూల్! పేరుతో విజయక్రాంతి దినపత్రిక ప్రచురించిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం బ్రహ్మంగారి తండాలోని ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని అందులోకి ఇప్పటివరకు వంట మనిషి ఇంట్లో నిర్వహిస్తున్న పాఠశాలను బదిలీ చేశారు. ఈ మేరకు డీఈవో సత్యనారాయణమూర్తి కొత్తగా ఏ ర్పాటు చేసిన స్కూల్‌ను ప్రారంభించారు.

పక్కా భవనం లేక, నూతన భవనం అసంపూర్తి గా ఉండటం వల్ల, విద్యార్థులు పడుతున్న ఇ బ్బందులను తొలగించాలని కలెక్టర్ స్నేహ శబరిష్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేకుల షె డ్డు వరండాలో నిర్వహిస్తున్న స్కూల్‌ను కొత్తత భవనంలోకి తాత్కాలికంగా మార్చినట్లు చెప్పారు. అసంపూర్తిగా ఉన్న స్కూల్ భవనాన్ని  త్వరలో ని ర్మాణం పూర్తి చేయడానికి కూడా చర్యలు తీ సుకుంటామన్నారు. ఎంఈఓ యాదగిరి, కాం ప్లెక్స్ హెడ్మాస్టర్ చంద్రశేఖర్, డి.ఎస్.ఓ అప్పారావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్ శ్రీశైలం, ఉపాధ్యాయుడు సంతోష్, తండావాసులు పాల్గొన్నారు.