04-08-2025 01:43:11 AM
బెంగళూరు, ఆగస్టు 3: కర్ణాటక ధర్మస్థలలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బెళ్తంగడి పోలీసులు 2000 మధ్య చోటు చేసుకున్న అసహజ మరణాల రికార్డుల ను రిజిస్టర్ (యూడీఆర్) తొలగించినట్టు సమాచార హక్కు చట్టం కింద చేసిన దర్యాప్తులో వెల్లడైంది.
వంద ల మంది యువతులు, మహిళల మృతదేహాలను పాతిపెట్టినట్టు ఓ పారిశుధ్య కార్మికుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కన్నడ ప్ర భుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా.. ఈ మృతదేహాల లెక్క తేల్చేందుకు సి ట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ యువతి మృతదేహాన్ని అక్రమంగా పాతిపెట్టడం తాను కళ్లా రా చూశానని.. ఆ సమయంలో అధికారులు కూడా అక్కడ ఉన్నారని ఆ ర్టీఐ కార్యకర్త జయంత్ సిట్‌కు ఫి ర్యాదు చేశాడు.