15-07-2025 01:34:53 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో మహిళ మృతిచిందింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య పదికి చేరింది. హైదర్‌నగర్‌కు చెందిన పుట్టి గంగమణి (40) ఇంటి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నది. కల్లు తాగే అలవాటు ఉండటంతో ఈ నెల ఆరవ తేదీన హైదర్‌నగర్‌లోని కల్లు దుకాణంలో కల్లు తాగి ఇంటికి వెళ్లింది.
అదే రోజు రాత్రి ఆమెకు తీవ్రమైన వాంతులు విరోచనాలు కావ డంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 13వ తేదీన మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె భర్త బసవయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన వెనుక ఎక్సుజ్ శాఖ పూర్తి నిర్లక్ష్యం ఉందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నివేదికలున్నా చర్యలు శూన్యం
కూకట్‌పల్లి ఘటన జరగడానికి కొన్ని నెలల ముందే ఆబ్కారీ అధికారులు హైదరాబాద్‌లో 20 కల్లు నమూనాలను పరీక్షించగా, అన్నింటిలోనూ అత్యంత ప్రమాదకరమైన ‘ఆల్ప్రాజోలం’ ఉన్నట్లు తేలింది. అయినా ఆ నివేదికలను తొక్కిపెట్టి, కల్తీ వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. దుర్ఘటన తర్వాత ఈ నెల 8, 11 తేదీల్లో సేకరించిన నమూనాల్లోనూ ఆల్ప్రాజోలం ఉన్నట్లు నిర్ధారణ కావడం ఎక్సుజ్ శాఖ వైఫల్యానికి అద్దం పడుతోంది.
నగరంలో విక్రయించే కల్లులో 90 శాతం కల్తీయేనని అధికారులకు తెలిసినా, వ్యాపారులకు చట్టంలోని లొసుగులు చెప్పి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాటి, ఈత చెట్లులేని చోట సైతం వేల లీటర్ల కల్లును ఆల్ప్రాజోలం, క్లోరోహైడ్రేట్, డయాజోపాం వంటి రసాయనాలతో తయారుచేసి అమ్ముతున్నారు,
ఈ రసాయనాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటకల నుంచి అక్రమంగా నగరానికి చేరుతున్నాయి. రెండు రోజుల క్రితం ముషీరాబాద్‌లో రూ.42 లక్షల విలువైన 12 లక్షల ఆల్ప్రాజోలం మాత్రలను అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఎవరినీ ఉపేక్షించం
నేటి నుంచి 19 స్పెషల్ డ్రెవ్‌తో కల్లు డిపోలపై దాడులు, కల్లు కంపౌండులు, కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించడానికి స్పెషల్ డ్రెవ్ చేపట్టింది. వారం రోజులు పాటు కల్లు అమ్మకాలు జరిగే కంపౌండులపై ఎస్‌టిఎఫ్ ,ఏసీ ఎన్‌ఫొర్స్‌మెంట్ టీమ్‌లు డీటీఎఫ్‌లు దాడులు చేపట్టనున్నాయి. ఎక్సుజ్ స్టేషన్ల సిబ్బంది కల్లు దుకాణాలపై నిఘా పెట్టి అకస్మిక డాడులు నిర్వహిస్తారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డెరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
కల్తీకల్లుగా అని తేలితే ఎవరినీ ఉపేక్షించుం. వారిపై కేసులు నమోదులు చేస్తున్నా ఆయన తెలిపారు. కూకట్‌పల్లి పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటనను పురష్కరించుకొని మరోమారు స్పెషల్ డ్రెవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఖాసీం, ఎక్సుజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టర్