calender_icon.png 15 July, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని అదృశ్యం

15-07-2025 12:04:26 AM

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

చేగుంట (విజయక్రాంతి): కస్తూర్బా పాఠశాల(Kasturba School)లో ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చిన పుట్టి భవాని(16) వారం రోజులుగా అదృశ్యం కావడం కలకలం సృష్టించగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా హంగ్రీ గ్రామానికి చెందిన విద్యార్థి, విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో, తల్లి మతిస్థిమితం బాగా లేక, బాలిక పెద్దమ్మ, మేనమామ కలిసి చేగుంట పరిధిలోని రెడ్డిపల్లి బీడీ కాలనీలోని గల కేజీబీవీలో చేర్పించారు. చేర్పించిన నుండి తాను ఆ విద్యార్థినికి మేనమామ అంటూ ఆ విద్యార్థినిని ఏడవ తేదీన కాలేజీ నుండి ఓ వ్యక్తి తీసుకెళ్లాడు.

ఆ విద్యార్థిని ఆచూకీ తెలియకపోవడంతో మిస్టరీగా మారిపోయింది. ఈ విషయంపై పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీవాణి, ఉపాధ్యాయులు చేగుంట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్, నగేష్, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, సాయంత్రం 4 గంటల నుండి 4:45 నిమిషాల వరకు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న సిబ్బందితో చర్చించారు. ఇట్టి విషయంపై చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.