calender_icon.png 14 August, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

13-08-2025 06:54:35 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ డా. బిఆర్ బస్సు స్టేషన్ ఆవరణలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం సముదాయంలో డ్రగ్స్ రహితజీవన శైలిని అనుసరిస్తూ ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ బి. రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్. భూపతి రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్(మెకానికల్) పి. మల్లేశం, పర్సనల్ ఆఫీసర్ జి. సత్యనారాయణ, పర్సనల్ ఆఫీస్ కార్యాలయ సూపరింటెండెంట్ బి. సత్తయ్య పాల్గొనారు.