13-08-2025 06:52:05 PM
ఎమ్మార్వో చంద్రశేఖర్..
మునగాల (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మార్వో వి చంద్రశేఖర్(MRO Chandrasekhar) అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ లలో నషా ముక్త భారత్ మాదకద్రవ్యాల నిర్మూలన పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ... మత్తుపదార్థాలు ఉపయోగించినా, రవాణా చేసిన చట్టరిత్యా నేరమన్నారు. మత్తు పదార్థాల కేసుల్లో విద్యార్థులు ఇరుక్కుంటే మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితం అంధకారం అవుతుందని తెలిపారు.
కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. డ్రగ్స్ రహిత భారత దేశంగా తీర్చిదిద్దుతామంటూ మత్తుకు దూరంగా ఉండాలని ఎమ్మార్వో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల పరిష త్ అభివృద్ధి అధికారి చింతల రమేష్, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్, ఆర్ ఐ రామారావు, ఐ సిస్ డిఎస్ సూపర్వైజర్ శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ అజంబాబా, కార్యదర్శి చంద్రశేఖర్,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.