31-10-2025 12:00:00 AM
 
							ఘట్ కేసర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధస్సు విభాగాధిపతి డాక్టర్ మల్లికర్జునరెడ్డి హైదరాబాద్లోని టి-హబ్లో జరిగిన భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవారడ్స్2025 కార్యక్రమంలో అన్వేషణ ఆచార్య అవార్డుతో సత్కరించబడ్డారు. ఈ జాతీయ స్థాయి పురస్కారం, కృత్రిమ మేధస్సు రంగంలో డాక్టర్ మల్లికార్జునరెడ్డి అసాధారణ నాయకత్వం, విద్యా ప్రతిభ, నూతన ఆవిష్కరణల ఆధారిత బోధన, ప్రభావవంతమైన పరిశోధనల పట్ల ఆయన కృషిని గుర్తిస్తూ ప్రదానం చేయబడిందని తెలిపారు.
ఈప్రతిష్టాత్మక పురస్కారాన్ని మార్రి లక్ష్మణ్ రెడ్డి చైర్మన్, ఎంఎల్‌ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కే. ప్రసాద్ వైస్ చాన్సలర్, జెఎన్టియు కాకినాడ, బుద్ధ చంద్రశేఖర్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (ఎఐసిటిఈ), పి. బాలప్రసాద్ (టిసిఎస్) వంటి ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక రంగ నిపుణుల చేత అవార్డు అందజేయబడింది.
ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ తన అనుభూతిని వ్యక్తం చేస్తూ .. ఈ గౌరవం నాకు ఎంతో ఆనందం కలిగించిందని, ఇది నిరంతర విద్య, ఆవిష్కరణ, సహకారం ద్వారా నాణ్యమైన విద్యా పరిశోధనను ముందుకు తీసుకెళ్లే శక్తిపై నా విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం యాజమాన్యం, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, మార్గదర్శకులు, విద్యార్థుల అచంచలమైన సహకారం, టీమ్ స్పిరిట్, ప్రోత్సాహానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.