31-10-2025 08:25:42 AM
 
							బెజ్జూర్ మండల కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించినట్లు ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ పోలీస్ స్టేషన్ నుండి సబ్ స్టేషన్ వరకు నిర్వహించారు. భారతదేశ ఐక్యతకు ప్రతీక, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని"జాతీయ ఏకతా దివస్" వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజేతలకు మొదటి,రెండవ,మూడవ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.