31-10-2025 01:50:27 AM
 
							బూర్గంపాడు,అక్టోబర్30,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఓపి రూము, పేషెంట్లకు సరిపడా బెడ్లు అందుతున్న వైద్యం, మంచినీటి సౌకర్యం, వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, ప్రతిరోజు రోగుల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మండల కేంద్రానికి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందాలని,108 అం బులెన్స్ సౌకర్యం, సరిపడా మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నిల్వ ఉంచుకోవాలని, వైద్యులు సమయపాలన పాటించి నిత్యం వైద్య వృత్తి సేవగా చేసే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
స్వయంగా తాను బిపి మిషన్ ద్వారా పరీక్ష చేయించుకోవడం జరిగింది. అంతేకాకుండా తాను బ్లడ్ తీయించుకొని రక్త పరీక్షలు చేయించుకోవటం పట్ల రోగులకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో స్వయంగా పర్యవేక్షణ ద్వారా తె లుసుకున్నారు.డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.