31-10-2025 02:13:47 AM
 
							భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 30, (విజయక్రాంతి): ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, దేవుని మాన్యం భూములకు రక్షణ కరువైనట్లు తేటతెల్లమవుతోంది. అందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పలు ప్రభుత్వ, దేవుని మాన్యం భూముల కబ్జాతీరు అద్దం పడుతోంది. అక్రమార్కులకు అధికారం మంత్రి అండదండలు మెం డుగా ఉన్నాయని, దీంతో రెవెన్యూ యంత్రాంగం యావత్తు నిస్సహాయ స్థితిలో ఉన్న ట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అదే అదునుగా రెవెన్యూ రాష్ట్ర స్థాయి అధికారులకు ఆర్థికలబ్ధి ఎరచూపి, రాజకీయ ఒ త్తిళ్లకు గురిచేస్తూ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ లో గుసగుస. అక్రమార్కులు సామాజిక సేవను తెరపైకి తెచ్చి నాలుగో స్తంభంగా చెప్పుకునే పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మించి ప్రభుత్వ భూమిని, దేవుడిగుడి పునర్నిర్మా ణం సాకుతో దేవుని మాన్యం భూమిని దిగమింగాడని బహిరంగంగా చర్చించుకుంటు న్నారు.
ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఆర్థిక లావాదేవీల కారణంగా ప్రభుత్వ, దే వుని మాన్యం భూములకు రక్షణ లేనట్లు తేటతెల్లమవుతుంది. మంత్రులు మాత్రం వేదికలపై ప్రభుత్వ, దేవుని మాన్యం భూము ల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ పదుల సంఖ్యలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న చర్యలు తీసుకోకపోవడం అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు మెండు అనే ఆరోపణను ధ్రువపరుస్తున్నా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వం చ పట్టణ మండలంలో చోటు చేసుకున్న సంఘటనలు మచ్చుతునకలు మాత్రమే.
ప్రెస్ క్లబ్ నిర్మాణం పేరుతో ప్రభుత్వ భూమి హాంఫట్
పాల్వంచ పట్టణంలో ప్రెస్ క్లబ్ నిర్మించి నా ఆ ప్రబుద్ధుడు సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించిన వైనాన్ని ఇప్పటికీ విజయక్రాంతి వరు స కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. అక్రమార్కులు 817/58లోని సోషల్ వెల్ఫేర్ పట్టా భూమిని కొనుగోలు చేసి, అధికారులు, కొంతమంది పాత్రికేయులను బుట్ట లో వేసుకొని దర్జాగా 817/ 1 ప్రభుత్వ భూ మిని ఆక్రమించి హెచ్ కన్వెన్షన్ హాల్ను, గ్రామపంచాయతీలో నిర్మించి తప్పుడు దృవీకరణ పత్రాలతో సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు పొంది, అవే అనుమతులు అంటూ ప్రజలను బుకాయిస్తూ దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అంతటితో ఆగకుండా పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 61ని ఆక్రమించి ఫంక్షన్ హాలుకు రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్న వైనం విధితమే. ఈ ఆక్రమణలపై సాక్షాధారాలతో పత్రిక వెలుగులో కి తెచ్చిన, ఏకంగా తహసిల్దార్ కోర్టులో దాఖలు చేసిన అఫిడిటిలో వాస్తవాలు తెలిపిన రెవెన్యూ అధికారులు చర్యలు ఉపక్రమి ంచకపోవడం అధికార పార్టీ అండదండలే అని స్పష్టమవుతుంది. చర్యలు సంగతి దేవుడెరుగు కనీసం సర్వేకు కూడా రెవెన్యూ అధి కారులు అడుగు ముందుకు వేయడం లేదం టే ఇక ప్రభుత్వ భూమికి రక్షణ ఎక్కడిది.
ఇది ఎలా ఉండగా తాజాగా హెచ్ కన్వెన్షన్ హాల్ సమీపంలో మరో కుల సంఘం నాయకులు ఏకంగా గిరిజన చట్టాలను అతిక్రమించి పిఓపి వాయులేషన్ (అతిక్రమణ) చేసి పహానిలో గిరిజనేతరులు నమోదు కావడం, అట్టి భూమిని మరో గిరిజనేతరులు చట్ట విరుద్ధం గా కొనుగోలు చేసి సంఘం ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి పూనుకోవడంలో మరో అధికార పార్టీ మంత్రి చలువ ఉన్నట్లు తెలుస్తోంది. 2016- 17 సంవత్సరం వరకు పట్టాదారుగా మాలోత్ సామ్య పహానిలో నమోదయి ఉన్నాడు.
2017- 18 సంవత్సరంలో సామ్యకు బదులుగా బోద రాంబాబు అనుభవదారీ కాలంలో నమోదయి పి ఓ టి వాయులేషన్ జరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పి ఓ టి అతిక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించిన ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం ఆ మంత్రి ఆదేశమేనని బహిరంగంగా చెప్పకుంటున్నారు. ఇద్దరు మంత్రుల వత్తిళ్లకు తలవగ్గిన రెవెన్యూ శాఖ అధికారులు చర్యలకు పూనుకోకపోవడంతో ఆ కులసంఘం ఏజెన్సీ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నిర్మాణ నిర్మాణానికి ఉపక్రమిస్తోంది.
గుడి పేరుతో ఆరు ఎకరాల దేవుని మాన్యానికి గురి?
ఇదిలా ఉంటే పట్టణ పరిధిలోనే గుడిపాడు మోక్ష వెంకటేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం పేరుతో దేవుని మాన్యం భూ మి ఆరు ఎకరాలకు అక్రమార్కులు గురిపెట్టినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. ఎప్ప టినుంచో దేవుని మాన్యం భూములు కబ్జాకు గురై రియల్ ఎస్టేట్ భూములుగా రూపాంతరం చెందుతున్నాయని పత్రికల్లో పుంకాలు పొంగాలుగా శీర్షికలు వెలబడ్డ విషయం విధితమే.దీంతో స్పందించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2021లో దేవాల య భూములను సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని రెవెన్యూ శాఖ అధికారులను కోరారు.
దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ భూ ములను సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని తాసిల్దార్ ను ఆదేశించారు. ఐదు సంవత్సరాల అయినా దేవుని మాన్యం భూములపై సర్వే జరగకపోవడం అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి మెండుగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుని మాన్యం, వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు చట్టం తెస్తానని చెబుతున్న, మరోవైపు అదే పార్టీ నాయకుల అండదండలతో దేవుని మాన్యం భూములు ఆక్రమాలు జరగటం గమ్మత్తుంది పో.1958 - 59 సంవత్సరము నుంచి దేవాదాయ శాఖ భూము లు రెవెన్యూ రికార్డులో నమోదయ్యాయి.
కాకతీయుల నాటే దేవాలయానికి 21.30 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల ధ్రువపరుస్తున్నాయి. అట్టే భూములను ఆనుకొనే ఇనాం పట్టాలు ఉండటంతో అక్రమదారులకు అది బలంగా మారింది. రెవెన్యూ అధి కారుల అండదండతో దేవుని మాన్యం భూములకు గురి పెట్టారు కొందరు మహానుభావులు. మస్తాన్ రావు తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రోజుల్లో గుడిపాడు అంగన్వాడీ కేంద్రానికి, ప్రభుత్వ పాఠశాలకు, ఇళ్ల స్థలాలకు ఐదు ఎకరాల భూమిని కేటాయించారు.
అదే అదునుగా అప్పట్లోనే కొందరు దేవాలయ భూములను ఆక్రమించుకున్నారు. కొందరు ఇంటి నిర్మాణాలు చేపడితే, మరికొందరు సేద్యం చేస్తూ వారి కబ్జాలోనే ఉంచారు. 2021 నుంచి ఆలయ భూముల సర్వే చేయాలని ఆదేశాలు ఉన్న అమలు కాకపోవడంతో భూములు యావత్తు కబ్జాకు గురై ప్రస్తుతం కేవలం మూడు ఎకరాలు మాత్రమే భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేవస్థానం భూమిలో అప్పట్లో చర్చి నిర్మాణం కోసం నిర్మాణం ప్రయత్నం చేస్తుండగా ఈవో దాన్ని తొలగించడం జరిగింది.
ఆ ప్రాంతా న్ని ఇంటి నిర్మాణం కోసం ఆ పెద్దమనిషి కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 12 ఎకరాల మేరకు దేవుని మాన్యం భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. సామాజిక సేవ పేరుతో ఓ ప్రబుద్ధుడు గుడి నిర్మాణం చేసి 6 ఎకరాల భూమికి గురి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అందుకు స్థానికంగా ఉన్న బినామీకి భారీ ఎత్తున నజరానా ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆక్రమణకు గురైన ప్రభుత్వ, దేవుని మాన్యం భూములను పరిరక్షించాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చిన చర్యలకు ఉపక్రమించని తీరు రెవెన్యూ అధికారుల నిస్సహాయ స్థితికి అద్దం పడుతోంది.