31-10-2025 08:22:36 AM
 
							బంగారం దొంగతనం చేశారని సోమనరసమ్మను పోలీస్ స్టేషన్ లో వేధింపులు.
వేధింపులకు తాళలేక సోమ నరసమ్మ ఉరిపోసుకొని మృతి.
సోమ నరసమ్మ మృతితో వెంపటిలో ఉద్రిక్తత.
తుంగతుర్తి,(విజయక్రాంతి): ఎస్సై వేధింపులకు తాళలేక ఓ మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు సరిత అనిత మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 15 రోజుల క్రితం సోమ నరసమ్మ(50) బావగారు మల్లయ్య ఇంటిలో బంగారం పోయిందని నేపంతో సోమ నరసమ్మ పై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో వెంబడి గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులు, మల్లయ్య కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పలుమార్లు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి 8 గంటల వరకు తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమనరసమ్మను ఉంచి, కోపోద్రిక్తులైన ఎస్సై క్రాంతి కుమార్ కనీసం మహిళా అని చూడకుండా, వేధింపులకు గురి చేసి, నిన్ను జైలుకు పంపుతాం, నీవే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని నీవే ఫింగర్ ప్రింట్స్ ఉన్నవని కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేశారు. దీనితో ఆవేదనకు గురైన సోమ నరసమ్మ రాత్రికి రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది . జరిగిన సంఘటన వై ఎస్సైని వివరణ అడగగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. సోమనసమ్మ మృతిపై పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించిన ఎస్సై క్రాంతి కుమార్ పై రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులు, జిల్లా పోలీసులు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు , గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.