calender_icon.png 31 October, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో.. డెయిరీ మిల్క్‌లో పురుగులా!

31-10-2025 01:40:34 AM

  1. డెయిరీ మిల్క్ చాక్లెట్లో కదలాడిన పురుగులు
  2. ప్రశ్నించిన వినియోగదారుడిపై యజమాని దురుసు
  3. మణికొండ పుప్పాలగూడలో ఘటన

మణికొండ, అక్టోబర్ 30, (విజయక్రాంతి): నోరు తీపి చేసుకుందామని కొన్న చాక్లెట్లో పురుగులు పాకుతూ కనిపిస్తే ఆ షాక్ ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి దిమ్మతిరిగే అనుభవమే మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో ఓ వినియోగదారు డికి ఎదురైంది. గురువారం పుప్పాలగూడలోని బీఆర్సీ సమీపంలో ఉన్న ఓ కిరాణా షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ వినియోగదారుడు సదరు షాపులో ప్రముఖ బ్రాండ్‌కి చెందిన ’డెయి రీమిల్క్’ చాక్లెట్ కొనుగోలు చేశాడు.

దాన్ని తెరిచి చూడగా, లోపల పురుగులు ఉండటం చూసి విస్తుపోయాడు.వెంటనే షాపు యాజమాని వద్దకు వెళ్లి, చాక్లెట్లోని పురుగుల గురించి నిలదీశాడు. అయితే, పాడైపోయిన వస్తువును అమ్మినందుకు చింతించాల్సింది పోయి, ఆ యాజమాని ఎదురు వినియోగదారుడిపైనే దురుసుగా ప్రవర్తించాడు. ‘ఇదేంటి?‘ అని ప్రశ్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రముఖ కంపె నీ ఉత్పత్తుల్లో ఇలా పురుగులు రావడం, కనీ స బాధ్యత లేకుండా యాజమానులు వ్యవహరించడంపై ఆ వినియోగదారుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాణ్యత లోపించిన వస్తువును అమ్మి, పైగా తప్పును ప్రశ్నిస్తే దబాయించడం ఏమిటని స్థానికులు సైతం యాజమాని తీరుపై మండిపడ్డారు.సంబంధిత ఆహార తనిఖీ అధికారులు ఇలాంటి షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.