31-10-2025 01:27:26 AM
 
							విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 30: మొంథా తుఫాన్ బీభత్సానికి లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. వరి, పత్తి నీళ్లపాలైంది. కొనుగోలు కేంద్రాల్లో లక్షల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదుకోవాలని విలపిస్తున్నారు. పలు జిల్లాల్లో బాధితుల వద్దకు వచ్చిన కలెక్టర్ల కాళ్లు పట్టుకొని అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించ పంట కొట్టుకుపోయిందని, తము ఆదుకోవాలని వేడుకు న్నారు.
కరీంనగర్ జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 11,644 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 668 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,452 ఎకరా ల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వరిచేను నేలకొరిగింది. పత్తిపంట తడిసి ముద్దయింది.
మార్కెట్ యార్డులో లక్షల క్వింటాళ్ల ధాన్యం తడిసి, వరదనీటిలో కొట్టుకుపోయింది. కరీంనగర్ జిల్లాలో 183 గ్రామాల పరిధిలోని 3,321 మంది రైతుల 3,512 ఎకరాల్లో పత్తి చేన్లు తడిసి ముద్దయ్యా యి. 30,560 ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో 4,684 క్వింటాళ్లు, డీసీఎంఎస్ కేంద్రాల్లో 6,690 క్వింటాళ్లు, హాకా కొనుగోలు కేంద్రాల్లో 270 క్వింటాళ్ల ధాన్యం తడిసింది.
కొత్తగూడెం జిల్లాలో 1,452 ఎకరాల్లో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,452 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 7 మండలాల్లో 24 గ్రామా ల్లో పంట నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 559 మంది రైతులకు చెందిన 1,179 ఎకరాల్లో వరి పంట, 175 మంది రైతులకు చెందిన 273 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు.
టేకులపల్లి, ములకలపల్లి, చుంచుపల్లి, ఇల్లందు, చర్ల ,అశ్వరావు పేట, సుజాతనగర్ మండలాల్లో తుఫాను ప్రభావం కనిపించింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. చేతికి వచ్చిన వరి పంట అకాల వర్షానికి నీట మునగటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభు త్వం సకాలంలో స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లాలో
తుఫాన్‌కు సిద్దిపేట జిల్లాలో పంటలన్నీ అతలాకుతలమయ్యాయి. చేతికొచ్చిన వరి ధాన్యం, పత్తి నీటిలో కొట్టుకుపోయి రైతులకు కన్నీరు మిగిల్చింది. కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. వందల ఎకరాలలో వరి, కూరగాయల పంటలు నేలకొరిగాయి. రోడ్లపై ధాన్యం, కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన వరి మొక్కజొన్న ధాన్యం వర్షం నీటికి కొట్టుకుపోయింది.
ధాన్యం విక్రయించుకునే సమ యానికి నీటిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరంగల్ జిల్లాని భీమదేవరపల్లి మండలంలోని వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఆదర్ శ్రీనివాస్ తెలిపారు. అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్ జిల్లాలో చేతికి అందుతుందన్న పంటలను మొంథా తుఫాన్ సర్వనాశనం చేసింది. జిల్లాలో ని 10 మండలాల్లోని పంటలపై చూపింది. 710 మంది రైతులకు సంబంధించి 688 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
నేడు కూడ భారీ వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాం తి): మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షా లు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా అతి భారీ నుంచి అత్యం త భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యా ల, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తెలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.