29-10-2025 12:00:00 AM
ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 28 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంగళవారం బీహార్ రాష్ట్రవాసులు ఛట్ పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం ఆవరణలో ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తర భారతీయ సోదర సోదరీమణులు ఆచరిస్తున్న ఛట్ పూజ భారతదేశ సమగ్ర సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని అన్నారు.
సూర్యుడిని ఆరాధించే ఛట్ పూజలో భక్తులు నది తీరాల వద్ద ఉపవాస దీక్షలు, పండ్ల నైవేద్యాలు సమర్పిస్తారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉత్తర భారతీయు ల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ధర్మకర్త ఛాతిరి మధుసాగర్, ఉత్తర్ భారతి నాగరిక్ సంఘ్ అధ్యక్షుడు ఎన్ కే సింగ్, అమరదీప్ సింగ్, నంద కిశోర్ సింగ్, ఆదిత్య సింగ్, సంఘ్ పరివార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్ పెద్ద చెరువులో ఉత్తర భారతీయులు ఛట్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మానవ కళ్యాణ్ సేవా సంఘ్ సభ్యులు మనోహర్ సింగ్, ఓపీ సింగ్, రాజ్ కుమార్ పాండే, రాజీవ్ వర్మ, నందకిషోర్ మిశ్రా, విజయ్ గౌడ్, రమన్ భాయ్, రమన్ శర్మ కమల్ శర్మ, బూరెల్ల భాస్కర్ పాల్గొన్నారు.
బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగోల్ చెరువులో ఉత్తర భారతీయులు ఛట్ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, డీఈ నీలిమ, జవాన్ దర్శన్, బీహార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్రేష్ కుమార్ మౌర్య, రాము, అమర్ నాథ్, మౌర్య, దినేశ్, బబ్లూ గుప్తా, మోహిత్, మంటూ కేసరి, అభిషేక్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.