17-05-2025 12:51:28 AM
సిఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు
మహబూబాబాద్, మే 16 (విజయ క్రాంతి): తెలంగాణ వాసికి ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్య క్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు.
ఈ విష యాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ టిడి పి కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన సందర్భంగా ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని వివరించి అతనికి ఆర్థిక సాయం అందించాలని కోరగా, ఆ మేరకు సీఎంఆర్‌ఎఫ్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు.
మీ మేర కు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జారీ అయిన చెక్కును బాధితుడికి రామచంద్రరా వు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుతారపు వెంకటనారాయణ, ప్రేమ్చంద్ వ్యాస్, పిట్టల రాము తదితరులు పాల్గొన్నారు. .