07-07-2025 01:26:30 AM
- జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
- అక్కసు వెళ్లగక్కిన చైనా
న్యూఢిల్లీ, జూలై 6: టిబెట్ ఆధ్యాత్మిక గు రువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. దలైలామా శాంతికి రూపం అని ప్రధాని మోదీ ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబి యో కూడా దలైలామాకు జన్మదినశుభాకాంక్షలు తెలిపారు.
దలైలామా మాట్లా డు తూ.. ‘మానవతా విలువలు, మత శాంతి ప్ర చారం చేయడానికి నేను కట్టుబడి ఉంటా. టిబెట్ సంస్కృతి ప్రపంచానికి మానసిక ప్ర శాంతత, కరుణ అందిస్తుంది. 15వ దలైలా మా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దా న్ని నిర్వహించే అధికారం కేవలం గాడెన్ పో డ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉంది.’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే అ ధికారం ఎవరికీ లేదన్నారు.
చైనా అక్కసు
దలైలామా వారసుడి ఎంపిక విషయం లో చైనా మరోసారి విద్వేష వ్యాఖ్యలు చేసిం ది. భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘ద లైలామా సుదీర్ఘ సంప్రదాయంలో ఒక భా గం మాత్రమే. ఈ సంప్రదాయాలు ఆయన తో మొదలు కాలేదు. ఆయనతో అంతం కా వు.’ అని వారసుడి ఎంపిక గురించి వ్యాఖ్యానించారు.