16-09-2025 04:04:37 PM
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) కొత్త జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్(Apollo Tyres) నిలిచింది. ఒక్కో మ్యాచ్ కు రూ.4.50 కోట్లు అపోలో టైర్స్ బీసీసీఐకి చెల్లించనుంది. 2027 వరకు భారత్ ఆడే మ్యాచ్ లకు అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్ గా నిలవనుంది. కాగా, ఇంతకుముందు భారత్ కు డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్ గా వ్యవహరించి.. భారత బోర్డుకు రూ.4 కోట్లు చెల్లించేది. పార్లమెంటులో ఇటీవల ఆన్ లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పోందిన నేపథ్యంలో డ్రీమ్ 11 ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. డ్రీమ్ 11 స్థానంలో అపోలో టైర్స్ స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. భారత జెర్సీ స్పాన్సర్ షిప్ కోసం కాన్యా, జేకే టైర్ కంపెనీలు పోటీపడ్డాయి. బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు బీసీసీఐ గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకుకు చెందిన బ్రాండ్ లను బిడ్డింగ్ నుండి నిషేధించిందని స్పష్టం చేసింది. యుఎఇలో జరుగుతున్న ఆసియా కప్ లో టోర్నీలో భారత పురుషుల క్రికెట్ జట్టు మధ్యలో అపోలో పేరున్న కొత్త జెర్సీలను పొందుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. అయితే, రాబోయే టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త అపోలో టైర్స్ జెర్సీలతో ఆడే అవకాశం ఉంది.