calender_icon.png 16 September, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు అస్వస్థత

16-09-2025 05:57:07 PM

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Congress leader Madhu Yashki Goud) మంగళవారం అస్వస్థతకు గురైయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఛాతినొప్పి అంటూ ఒక్కసారిగా మధుయాష్కి గౌడ్ కూలబడిపోయారు. గమనించిన అధికారులు వెంటనే సచివాలయంలోని డిస్పెన్సరీలో తక్షణ వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మధుయాష్కి గౌడ్ ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థత విషయం తెలుసుకున్న మధుయాష్కీ గౌడ్ అనుచరులు, సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఏఐజీ ఆసుపత్రికి తరలివస్తున్నారు. మధుయాష్కీ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తొంది.