16-09-2025 05:47:26 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రెండో వార్డుకు చెందిన మాదరబోయిన రవికుమార్ అనారోగ్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ యువ నాయకుడు నిచ్చకోల వంశీకృష్ణ చేతుల మీదుగా అందించారు. తన అభ్యర్థుల మేరకు సహాయం అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, యువ నాయకులు వంశీకృష్ణకు మాదరబోయిన రవికుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.