15-09-2025 01:37:27 AM
-ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యసేన
-మొదట బౌలింగ్‌లో తిప్పేసిన స్పిన్నర్లు
-బ్యాటింగ్‌లో షేక్ ఆడించిన అభిషేక్, సూర్యకుమార్
-ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి తలపడ్డ భారత్
-ఆటగాళ్ల మధ్య ‘నో షేక్ హ్యాండ్స్’
దుబాయ్, సెప్టెంబర్ 14: ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. 128 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అపురూప విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్స్‌తో పాటు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకపోవడం గమనార్హం. ఈ విజయంతో భారత్ నాకౌట్ దశకు మ రింత చేరువయింది. టీమిండియా 19వ తేదీ న పసికూన ఒమన్‌తో తలపడనుంది. రెం డు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండింటిలోనూ విజయం సాధించింది. 3 వికెట్లతో పాక్ నడ్డి విరిచిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ రిటర్న్స్..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేర పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. అంతకుముందు వరకు కేవలం దా యాదిలానే ఉన్న పాకిస్థాన్‌ను పహల్గాం దాడి తర్వాత బద్దశత్రువులా చూడటం మొ దలుపెట్టారు. ఇప్పటికే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం బంద్ చేసిన టీమిం డియా అసలు ఆసియా కప్‌లో కూడా పాకిస్థాన్‌తో తలపడుతుందో? లేదోనని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశా రు. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు అస్సలుకే ఆడకు న్నా ఐసీసీ, ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) ఈవెంట్లలో మాత్రమే పాల్గొంటామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలయినా భారత్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అంతే కాకుండా భారత్ మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. కానీ ఈ మ్యాచ్ టికెట్లు మాత్రం అస్సలుకే అమ్ముడవలేదు.
తిప్పేసిన స్పిన్నర్లు
టాస్ గెలిచిన ఆనందం పాకిస్థాన్‌కు ఎంతో సేపు దక్కలేదు. బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించిన ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా మొదటి ఓవర్‌లోనే పాక్ ఓపెనర్ ఆయుబ్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. అక్కడి నుంచి ప్రారంభం అయిన పాక్ వికెట్ల పత నం ఏదశలోనూ ఆగలేదు. రెండో ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతికే వికెట్ కీపర్ హరిస్ (3)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఐదో ఓవర్ నుంచి మొదలైన స్పిన్ అటాక్‌తో పాక్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఎనిమిదో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ (17) పెవిలియన్ చేరా డు. పదో ఓవర్లో అక్షర్ మరోమారు సత్తా చాటాడు. కెప్టెన్ సల్మాన్ ఆగాను బుట్టలో వేసుకున్నాడు. ఇక 13వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్‌లను పెవిలియన్‌కు చేర్చా డు. దీంతో పాక్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక 17వ ఓవర్లో మరోమారు కుల్దీప్ మాయ చేశాడు.
కాస్తో కూస్తో ఆడుతున్న ఓపెనర్ పర్హాన్ (40)ను పెవిలియన్ చేర్చి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. 18వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి, 19వ ఓవర్లో బుమ్రా వికెట్లు తీసుకోవడంతో పాక్ 111కే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో టెయిలెండర్ షాహిన్ షా అఫ్రిది సిక్సర్లతో విరుచుకుపడటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయ గల్గింది. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి బంతి నుంచీ దూ కుడుగా ఆడింది. ఓపెనర్లు ఔటైనా కానీ కెప్టె న్ సూర్య కుమార్ యాదవ్ (47*), తిలక్ వర్మ (31) ఆచితూచి ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో తిలక్ వర్మ ఔటై నా కానీ ఆల్‌రౌండర్ శివం దూబే (10*)తో కలిసి కెప్టెన్ సూర్య లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్ పూర్తున అనంతరం ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు.