calender_icon.png 16 September, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

16-09-2025 05:34:52 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో పాఠకులకు అనుకూలంగా ఉండేందుకు డిజిటల్ లైబ్రరీ ఎంతగానో దోహద పడుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్, గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్  తో కలిసి గ్రంథాలయంలోని డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.3.67 లక్షలతో ప్రత్యేక కంప్యూటర్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల మెటీరియల్స్ సులభంగా ఉంటుందన్నారు.