calender_icon.png 16 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం భోజనం అందించాలి: జీసీడీఓ శకుంతల

16-09-2025 05:42:56 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిసిడివో శకుంతల అన్నారు. బెజ్జూర్, చింతలమానపల్లి  మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలను జిసిడివో శకుంతల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు తదితర రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించే భోజనంను పరిశీలించారు.

విద్యార్థులకు అందించే భోజనం మెనూ ప్రకారం అందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులు ఇప్పటినుండి పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సిద్ధం కావాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే కృషి చేస్తానని తెలిపారు. వారి వెంట ప్రధాన ఉపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.