calender_icon.png 16 September, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

16-09-2025 05:50:26 PM

మందమర్రి,(విజయక్రాంతి): సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్, జిల్లా సమితి సభ్యులు సలేంద్ర సత్యనారా యణ పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్ లు డిమాండ్ చేశారు. పట్టణం లోని ఎఐటీయుసీ కార్యాల యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్స వాలను పురస్కరించు కొని పార్టీ జెండా ను సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజు ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాసిపిఐ నాయకులు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబు లకు వ్యతిరేకంగా జమీందారు, దేశముఖ్ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో దొడ్డి కొమురయ్య తొలి అమరుడయ్యారన్నారు.

భువనగిరిలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మహాసభ  ద్వారా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ లు గేరిల్లా దళాలను ఏర్పాటు చేసి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర  సిపిఐ పార్టీకే దక్కు తుందన్నారు. సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలను వదిలారని, వారి ఉద్యమ స్ఫూర్తిగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనం చేసి నిజాం నవాబులు వెళ్లిపోవారిని వారు స్పష్టం చేశారు.

కేంద్రంలోనీ  బిజెపి ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం మద్య జరిగిన పోరాటంగా  వక్రీకరిస్తూన్నారని, తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లు పాల్గొన లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను, అమరవీరుల త్యాగాలను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని వారు కోరారు. సెప్టెంబర్ 11 నుండి 17 వరకు గ్రామ, పట్టణ, మండల కేంద్రాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తూ సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని, సెప్టెంబర్ 17 ముగింపు సభ హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియం లో నిర్వహిస్తున్నామని, ఈ ముగింపు సభకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు.