30-08-2025 03:22:57 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పులిమడుగు గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి మండల తహసిల్దార్ సతీష్ కుమార్(Mandal Tehsildar Satish Kumar), ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్(MPDO Rajeshwar)లు భూమి పూజ నిర్వహించారు. శనివారం పులిమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన భవన నిర్మాణానికి వారు పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్వరలోనే కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, ఎపీఓ రజియా సుల్తానా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామ్ చందర్, కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నీలయ్య, గ్రామస్తులు రవి, మోహన్, శంకర్ లు పాల్గొన్నారు.