30-08-2025 03:50:36 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): 0 - 8 సంవత్సరాల వయసు గల పిల్లల మేధాశక్తి పెంపుదల కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్న ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ కేర్ ఈసీఈసీ దోహదపడుతుందని అంగన్వాడీ టీచర్ లలిత తెలిపారు. శనివారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) కేసముద్రం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈసీఈసీ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బేసిక్ విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి ఆల్ఫాబెట్స్, నంబర్లు, రంగులతో చిన్నారులకు విద్యాబోధన చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఆటపాటలతో, భాషాభివృద్ధి నైతిక విలువలపై చిన్నతనం నుండే నేర్పించడం జరుగుతుందన్నారు. ఐసిడిఎస్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు నేర్పిన విషయాలపై వివరించడం జరిగింది.