30-08-2025 03:43:12 PM
ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు
నకిరేకల్ (విజయక్రాంతి): ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులుపై నేటి నుంచి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రాధాన్యత ఇచ్చి చర్చించి అభివృద్ధి చేయాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాలకు బస్వాపూర్ ప్రాజెక్టు నుండి సాగు త్రాగు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ,ఎమ్మెల్సీ శంకర్ నాయక్. తదితరు పాల్గొన్నారు.