30-08-2025 03:32:16 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని 10 గ్రామ పంచాయతీల పరిధిలో పట్టణానికి చెందిన పలువురు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వారిని గుర్తించి ఓటర్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు తహసిల్దార్, ఎంపీడీవోలకు శనివారం వేరువేరుగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పట్టణానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రామాలలో తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, స్థానికేతరులు అయినందున వారిని గుర్తించి ఓటర్ జాబితా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ నీలయ్య, మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ మండల నాయకులు వేల్పుల రవి, బిజెపి మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ లు పాల్గొన్నారు.