30-08-2025 03:52:43 PM
మందమర్రి (విజయక్రాంతి): భారత స్వాతంత్ర సమరయోధులు కనైలాల్ దత్త జయంతి వేడుకలను పట్టణంలో మాజీ ఆర్మీ జవాన్ దంపతులు రాజేష్ పివ్హల్, రాణి పివ్హాల్ లు ఘనంగా నిర్వహించారు. శనివారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కనైలాల్ దత్త చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ జవాన్ రాజేష్ పివ్ హల్ మాట్లాడుతూ, 30 ఆగస్టు 1908 సం. లో పశ్చిమ బెంగాల్లో జన్మించిన కనైలాల్ దత్త చిన్నతనం నుండే దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు సుద్దాల ప్రభుదేవ్, జ నందిపాట రాజ్ కుమార్, జావిద్, నక్క శ్రీహరి, వలస శ్రీ చరణ్, లావణ్య లు పాల్గొన్నారు.