30-08-2025 03:30:05 PM
జిన్నారం/గుమ్మడిదల (విజయక్రాంతి): జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో చాకలి సుశీల, చాకలి నాగమణి శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల కొరకు వారితో కలిసి ముగ్గు పోయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య(Municipal Commissioner Venkata Ramaiah) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా నిబంధన మేరకు నిర్మాణం జరిగేలా చూస్తామని కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది బాలరాం, నవీన్, బిల్ కలెక్టర్ నర్సింగ్, కృష్ణ పాల్గొన్నారు.