calender_icon.png 30 August, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పీవోకేలోని ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి

16-05-2025 01:23:28 AM

భారత్‌కు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ సూచన

న్యూఢిల్లీ, మే 15: పహల్గాంలో ఉగ్రదాడిని బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తీవ్రంగా ఖండించారు. పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయాలని వ్యాఖ్యానిం చారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆయన కొనియాడారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడిన వీడియోను బాబ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘పహల్గాం భయానక దాడిని ఖండిస్తున్నాం. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది.

పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై కచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలి’ అని బాబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఎలాంటి చర్యలు తీసు కుంటున్నారో తెలపాలని అధికార ప్రభుత్వాన్ని కోరారు.

దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ స్పందించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భయం కరమైనదని లామీ అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్, పాక్‌లతో కలిసి పనిచేస్తుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొనే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు.