30-08-2025 03:45:36 PM
జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రాంనాథ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, ఉద్యోగ సమయంలో చేసిన సేవలు మరువలేనివని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్(District SP Sudhir Ramnath Kekan) అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పదవి విరమణ పొందుతున్న ఎస్.ఐ లు ఎం.సంజీవరెడ్డి, డి.నాగేశ్వరరావులను శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం అనేది ఎన్నో త్యాగాలు, కష్టసుఖాలతో కూడుకున్నదని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం సేవలందించడం గొప్ప విషయం అన్నారు. నిజాయితీగా సేవలందించిన ఎస్ఐల సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఆర్‌ఐలు అనిల్ కుమార్, నాగేశ్వర్ రావు, సోములు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.