30-08-2025 03:27:41 PM
చిన్నపిల్లలకు స్వయంగా అన్నం వడ్డీంచిన సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం (విజయక్రాంతి): పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Ambar Kishor Jha), మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ లతో కలిసి పాల్గొని సీపీ స్వయంగా MDHWS(మంథని డివిజన్ హ్యాండ్ క్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ), బాలల సంరక్షణ ఆశ్రమం, గోదావరిఖనిలోని పిల్లలకి భోజనం వడ్డీంచి వారితో కలిసి అధికారులు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, ఏఓ శ్రీనివాస్, వివిధ విభాగల ఇన్స్పెక్టర్ లు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, ఆర్ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సీపీఓ, ఆశ్రమం నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.