calender_icon.png 6 September, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా సెలవు తేదీ మార్పు కోసం సింగరేణి సీఎండీకి విజ్ఞప్తి

05-09-2025 01:34:28 AM

పెద్దపల్లి, సెప్టెంబర్ 4(విజయక్రాంతి) దసరా సెలవు తేదీ మార్పు కోసం సింగరేణి సీఎండీకి ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జ నక్ ప్రసాద్‌విజ్ఞప్తి చేశారు.సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రా బోయే అక్టోబర్ 2, 2025న గాంధీ జ యంతి, దసరా పండుగ ఒకే తేదీకి రావడం వలన సింగరేణి ఉద్యోగులకు ఒక పెయిడ్ హాలిడే నష్టం జరుగుతోందని,

ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు దసరా పండుగకు మరొక అనుకూలమైన తేదీని ప్రత్యా మ్నాయ సెలవుగా ప్రకటించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.ఉద్యోగుల సంక్షే మం, భావోద్వేగాలు, అలాగే పరిశ్రమలో అ మలులో ఉన్న సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని సింగరేణి యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని జన క్ ప్రసాద్ నమ్మకంవ్యక్తంచేశారు.