calender_icon.png 5 September, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియాను సరఫరా చేస్తాం

05-09-2025 01:36:24 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, సెప్టెంబర్ 4(విజయక్రాం తి): చొప్పదండి నియోజకవర్గం లోని రైతులెవ్వరు అధైర్య పడవద్దని, ఆందోళనకు గురి కావద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పి లుపునిచ్చారు. గంగాధర మండలం కురిక్యాల వద్ద యూరియా కోసం ఎదురుచూ స్తున్న రైతులను చూసిన ఎమ్మెల్యే కారు దిగి రైతుల వద్దకు వెళ్లారు. రైతులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు.

యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు, సరిపడా యూరియాను సరఫరా చే సి ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యేను కోరా రు. రైతులెవ్వరు ఆందోళన చెందవద్దని సరిపడా యూరియాను సరఫరాకు ఎమ్మెల్యే భ రోసా కల్పించారు.

సహకార సంఘం నిర్వాహకులతో మాట్లాడి సొసైటీకి వచ్చిన యూ రియా, రైతులకు పంపిణీ చేస్తున్న విధానా న్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా యూరియా సరఫరా చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలనిసూచించారు.