05-09-2025 01:28:12 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : బోధన అభ్యసన మేళా ద్వారా ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలో బోధనపై మరింత పట్టు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనీ రాయినిగూడెం వద్ద గల వికాస్ కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ లో 1 నుండి 5 తరగతుల వరకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బోధనాభ్యసన ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన 213 స్టాల్స్ ను సందర్శించి ప్రతి స్టాల్ లో ప్రదర్శించిన బోధన పరికరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.
ఈ ప్రదర్శనలో 8 ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలు పంపనున్నట్లు తెలిపారు. ఈయన వెంట డి ఈ వో అశోక్, కోఆర్డినేటర్ జనార్ధన్, ఎంఈఓ లు సకృ నాయక్, లింగయ్య, షరీఫ్, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.